ఈరోజు సాయంత్రం వైసీపీ అధినేత జగన్ తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి జగన్ కొద్ది సేపటి క్రితం రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు కలెక్టర్ ప్రద్యుమ్న, వైసీపీ ఎమ్మెల్యేలు 17 మంది, ఎంపీలు ముగ్గురు స్వాగతం పలికారు.
ఫలితాల అనంతరం తొలిసారి జగన్ అక్కడికి వెళ్లడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. రేణిగుంట నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో జగన్ బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకూ జగన్ ర్యాలీగా వెళ్లారు. ఈరోజు రాత్రికి తిరుమలలో జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం జగన్ తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం, తిరుమల నుంచి కడపకు జగన్ వెళ్లనున్నారు.
గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం: అమిత్ షా!