రంజాన్ నెల ఆకాశంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమైంది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయులను రంజాన్ పర్వదినంలోగా వదలిపెట్టడానికి సౌదీ అరేబియా అంగీకరించిందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
ముస్లింలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదేనని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. అసత్యాలకు, దూషణలకు దూరంగా ఉండటం, దయాగుణం, దానగుణం కలిగి ఉండటం సత్ప్రవర్తనకు మార్గాలని అన్నారు. ఈ లక్షణాలు అలవర్చుకుని జీవితమంతా కొనసాగించేందుకు రంజాన్ స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు తెలిపారు.
సీఎం జగన్ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు: ఏపీ సీఎస్