కలియుగ వైకుంఠ స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ ప్రకియ ప్రారంభిస్తాం అని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
కోవిడ్ వ్యాప్తి చెందుదన్న నేపథ్యంలో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి చేసే విధానాన్ని గత ఏడాది సెప్టంబర్ 25 నుంచి రద్దు చేసాం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు.
ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నా.. అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టీటీడీ ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్‌లైన్ విధానంలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా.. కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు.
ఫిబ్రవరి 15న పరిస్థితి అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీచేసే అంశంపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున..పరిమిత సంఖ్యలో టికెట్ల విడుదల ఉంటుందని టీటీడీ వెల్లడించింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని తెలిపారు.
డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదు: మంత్రి అవంతి