telugu navyamedia
ఆరోగ్యం

చలికాలంలో పాటించాల్సి ఐదు ఆరోగ్య సూత్రాలు..

శీతాకాలంలో సాధారణంగా చలి నుంచి కాపాడుకోవడం కోసం స్వెట్టర్లు, దళసరి దుస్తులు ధరించడం చాలా కామన్​. బాహ్య శరీరాన్నికాపాడుకోవడంపై చాలా శ్రద్ధ చూపించే చాలా మంది.. ఆరోగ్యం విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు.

చలి నుంచి తక్షణ ఉపశమనం కోసం చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తాగటం వంటివి చేస్తుంటారు. మరి ఇది ఎంత వరకు మంచిది? శీతాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారాన్ని ఈ కాలంలో తీసుకోవాలి? ఈ విషయాలన్నింటిపై నిపుణుల సూచనలు, సలహాలు మీకోసం….

నీళ్లు తక్కువగా తాగటం..

చలికాలం పీక్ స్టేజ్​కు చేరుకుంది. మరి ఈ సమయంలో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందామా?

చలికాలం అనగానే ఎక్కువ మంది సరిపడన్ని నీళ్లు తాగకపోవడం. ఎలాగు చలిగా ఉంది కదా ఎక్కువగా నీళ్లు తాగటం అవసరమా? అనుకుంటారు

చాలా మంది. అయితే అలా చేయడం తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు. సీజన్​ ఏదైనా కావాల్సినన్ని నీళ్లు తాగటం మంచిదంటున్నారు.

హైడ్రేషన్ వల్ల శరీర ఊష్టోగ్రత అదుపులో ఉండటమే కాకుండా.. రోగ నిరోధకతను పెంచడం, చర్మం నిగనిగలాడేలా చేస్తుందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

కెఫిన్​ అధికంగా తీసుకోవడం..

వాతావరణ చల్లగా ఉంటం వల్ల.. చాలా మంది ప్రతి రోజూ సాధారణం కన్నా ఎక్కువగా కాఫీ, టీలు తాగుతుంటారు. దీని వల్ల శరీరంలో కెఫిన్ మోతాదు పెరిగే

అవకాశముంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల డీ హైడ్రేషన్​, నిద్ర లేమి, ఆందోళన వంటి సమస్యలు

తలెత్తొచ్చని చెబుతున్నారు. అందువల్ల ఆరోగ్యం స్థిరంగా ఉండాలంటే.. కెఫిన్ మోతాదు అదుపులో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

చాలినన్ని నీళ్లు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచడం అవసరమని చెబుతున్నారు.

Related posts