ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పైలెట్ ప్రాజెక్టు కింద కృష్ణపట్నం లేదా మరో అనువైన ప్రాంతంలో డిశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా డి-శాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. సీఎస్ నేతృత్వంలో పది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు కానుంది. పరిశ్రమలు, పీఆర్, మున్సిపల్, జలవనరుల శాఖలకు చెందిన వివిధ స్థాయిల ఉన్నతాధికారులు సహా పునరుత్పాదక ఇంధన శాఖ కేంద్ర సంయుక్త కార్యదర్శి. కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. కమిటీలో సభ్యులుగా ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు కె. రాజేశ్వరరావు కూడా ఉండనున్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసే డి-శాలినేషన్ ప్లాంట్ పనితీరుపై కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు చెబుతున్నారు. సముద్ర జలాలను యాంత్రిక భాష్పీకరణ విధానం ద్వారా మంచినీటిని తయారు చేయాలన్న కేంద్రం సూచనల మేరకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎం జగన్ తో ఇజ్రాయెల్ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్ బృందం భేటీ అయ్యారు. విశాఖతో ప్రారంభించి దశలవారీగా విస్తరించాలని సూచించారు.
previous post
next post