telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మంత్రి పెద్దిరెడ్డికి షాకిచ్చిన నిమ్మగడ్డ !

ప్రస్తుతం ఏపీలో పంచాయితీల రగడ నడుస్తుంది. నిమ్మగడ్డ వర్సెస్‌ వైసీపీగా లోకల్‌ వార్‌ నడుస్తోంది. వైసీపీ పార్టీ ఎత్తులకు నిమ్మగడ్డ పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ఎస్ఈసి నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని ఈనెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని ఆదేశించిన ఎస్ఈసి నిమ్మగడ్డ… ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  అంతేకాదు ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నిమ్మగడ్డ.  అయితే.. దీనిపై డీజీపీ సవాంగ్‌ కూడా స్పందించారు. తనకు ఇంకా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ పేర్కొన్నారు. అటు టీడీపీ పార్టీ కూడా పెద్దిరెడ్డిని బర్త రఫ్‌ చేయాలని గవర్నర్‌ను కోరింది. కాగా…చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేయడమేంటి ? అని మంత్రి పెద్దిరెడ్డి నిమ్మగడ్డను ప్రశ్నించారు. ఎస్‌ఈసీ యాప్‌ను వాడొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని… కోర్టు తీర్పుతో ఎస్‌ఈసీ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలి అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఓటు నమోదు చేయడం తెలియని వ్యక్తి ఎస్‌ఈసీ ఎలా అయ్యారు ? ఏకగ్రీవాలు చట్టవిరుద్ధమని ఏ చట్టంలో ఉంది అని అన్నారు.

Related posts