telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ పై దాదా ప్రశంసలు…

‌పంత్‌ ఆట అంటే తనకు పిచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ ఆటను తాను ఆస్వాదిస్తానని చెప్పాడు. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ బౌలింగ్‌ను కూడా ఇష్టపడతానని పేర్కొన్నాడు. భారత్‌లో ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. సునీల్‌ గవాస్కర్‌ ఆడుతున్నప్పుడు ఆయన తర్వాత ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. కానీ సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే వచ్చారు. వాళ్లు వీడ్కోలు పలికాక విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రిషభ్ పంత్‌ బ్యాట్ అందుకున్నారు. క్రికెట్‌ పరంగా దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. ఏ తరంలోనైనా ఈ దేశం అత్యుత్తమ క్రికెటర్లను అందించగలదు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ మధ్య అస్వస్థతకు గురైన గంగూలీ ప్రస్తుతం తాను పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నానని అన్ని పనులు చేసుకుంటున్నానని తెలిపాడు. ఇటీవలే దాదాకు గుండె పోటు వచ్చిన విషయం తెలిసిందే. వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేయడంతో అతను పూర్తిగా కోలుకున్నాడు.

Related posts