తెలంగాణ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తల పేర్లు కర్ణాటక డ్రగ్స్ కేసులో కూడా వినిపిస్తున్నాయి. శాండల్ వుడ్ నిర్మాత శంకర్ గౌడ్ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డితో పాటు ఒక ఎమ్మెల్యే పాల్గొన్నట్లు సమాచారం. ఇదే వేడుకల్లో డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు కీలక సూత్రధారి ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. తెలుగు సినీ రాజకీయ రంగాల ప్రముఖులతో అతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అంతేకాక బెంగళూరులో ఉన్న ఒక సినీ రంగ ప్రముఖుడికి చెందిన హోటల్ లో డ్రగ్స్ పార్టీ కూడా జరిగిందని అతను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి ప్రముఖులు హాజరైనట్లు కూడా సీసీ టీవీ ఫుటేజ్ కూడా లభ్యమయినట్టు చెబుతున్నారు. నైజీరియన్ డాడీ బాయ్ ఈ డ్రెస్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సందీప్ రెడ్డి రెడ్డి, రతన్ రెడ్డిలకు పోలీసులు నోటీసు జారీ చేశారు విచారణకు హాజరు కాకపోవడంతో గోవిందపురం పోలీసులు చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post