telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గూగుల్ మాప్స్‌లో కొత్త ఫీచర్..

గూగుల్ ఈ పేరు తెలియని వారు ప్రపంచంలో ఉండరు. దాదాపు మనం దేని గురించి వెతకాలన్నా, ఏం తెలుకోవాలన్నా గూగుల్‌నే వాడతం. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో గూగుల్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం గూగుల్ మాప్స్ వాడకం కూడా విస్తారంగా పెరిగింది. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ మాప్స్‌ను వాడుతున్నారు. మనకి తెలిసిన ప్రదేశాలంటే మనం గుర్తుపడతాం, మరి తెలియని ప్రదేశాలకు వెళ్ల సరైన చోటకే వచ్చామోలేదో తెలియాలంటే ఎలా. అయితే ఈ సమస్యకు చెక్ చెప్పేందుకే గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకు రానుంది. ఈ ఫీచర్ గురించి గూగుల్ ఇటీవల బహిర్గతం చేసింది. గూగుల్ మాప్స్ వాడే వారు ఎవరైనా ప్రదేశాల ఫొటోలను అందులో అప్‌లోడ్ చేయొచ్చని తెలిపింది. అంతేకాకుండా ఈ ఫొటోలను అప్‌లోడ్ చేయడానికి మీకు ఈ ఖరీదైన కెమెరా అక్కర్లేదు. మీ ఫోన్ ఉంటే సరిపోతుంది. మీ ఫోన్ ద్వారా ఏ ప్రదేశం దైనా ఫోటో తీసి మాప్స్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. దీని ద్వారా తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సరైన చోటుకే వచ్చామా లేదా అనేది తెలుసుకోవడం సులభతరం అవుతుంది. దీని కోసం గూగుల్ తన మాప్స్‌లో అత్యాధునిక ఏఆర్ కోర్‌ను వాడుతుంది. పెద్దపెద్ద సంస్థలు లైవ్‌ వ్యూను ఇచ్చేందుకు దీనినే వాడుతారు. మాప్స్‌లో దీనిని ఉపయోగించి ఫోటోలను తీయాలి. తరువాత స్ట్రీట్ వ్యూ ఆప్ ద్వారా మాప్స్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. మీరు అప్‌లోడ్ చేసిని ఫొటో సరిగ్గా అదే ప్రదేశంలో చూపిస్తుంది. ఇది పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతుందని గూగుల్ అధికారులు తెలిపారు. దానికన్న ముందు మేము 360 డిగ్రీ కెమెరాలతో కొన్ని ఫోటోలు తీసి స్ట్రీట్ ఫోటోలా కనిపించే విధంగా చేయాలి. అప్పడే అందరికి ఎప్పటి కప్పుడు అప్‌డేట్ అవుతుంటుందని తెలిపారు.

Related posts