దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఆందోళన హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం శాఖ అత్యవసరంగా భేటీ అయింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో హొం శాఖ, నిఘా విభాగ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఢిల్లీలో పరిణామాలను తెలుసుకుంటున్న అమిత్‌షా… ఈ అత్యవసర భేటీకి నిర్ణయం తీసుకున్నారు. అయితే…ఈ ట్రాక్టర్ ర్యాలీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎర్రకోటను ముట్టడించింది. ఎర్రకోట బురుజుల పైకి చేరి ఫ్లాగ్ పోల్‌పై జెండాలు ఎగురవేశారు రైతులు. రిపబ్లిక్ డే పరేడ్ కంటే ముందే… ఉదయం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి అడుగుపెట్టారు. అయితే… రైతులు చట్టాలను ఉల్లంఘించకుండా సంయమనం పాటించాలని…. పోలీసుల పై దాడులు, విధ్వంసం సృష్టించవద్దని ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి చేశారు. కానీ ఢిల్లీలోని ముకర్బా చౌక్ వద్ద రైతులపై బాష్పవాయువును ఉపయోగించారు పోలీసులు. అటు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 25 కు పైగా మెట్రో స్టేషన్లు బంద్ చేశారు. మరోవైపు హింసాత్మక ఘటనలో ఓ రైతు మృతి చెందగా మరికొంత మంది రైతులు గాయపడ్డారు.
previous post
“టాలీవుడ్లో మరో వికెట్ పడింది…” నిఖిల్ పెళ్ళిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్