telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనాలో మరో కొత్త వైరస్…ఇప్పటి వరకు ఏడుగురి మృతి

china virus

కరోనా వైరస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలో ఇప్పుడు ఓ కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ రక్తంపీల్చే పినుజులు (టిక్స్) వంటి జీవుల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఈ నూతన వైరస్ బారినపడి ఏడుగురు మరణించారు. తూర్పు చైనాలోని జియాంగ్సు, అన్హుయి ప్రావిన్స్ ల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంది. 60 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ ను ప్రస్తుతానికి టిక్ బోర్న్ వైరస్ (టీబీవీ), లేదా నావెల్ బున్యా వైరస్ గా పేర్కొంటున్నారు.

సాధారణంగా కుక్కలు, పిల్లుల వంటి జంతువులను అంటిపెట్టుకుని, వాటి రక్తం పీల్చుతూ బతికే ఈ పినుజులు 83 రకాల వైరస్ లకు ఆవాసాలుగా ఉన్నాయని గుర్తించారు. ఈ వైరస్ సోకితే మనుషుల్లో తీవ్ర జ్వరం కలుగుతుంది. సరైన చికిత్స అందకపోతే మృత్యువాత తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చైనా ప్రభుత్వం, ఈ కొత్త వైరస్ విషయంలో ఆ పొరపాటు లేకుండా తన అధికారిక పత్రికలో వెల్లడించింది.

Related posts