telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఉప్పెనా టీజర్ వచ్చేది ఎప్పుడంటే…?

యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్. కానీ అతడు చేసిన ఉప్పెన సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదాల కాలేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సన దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ఎప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇది వైష్ణవ్ తేజ మొదటి సినిమా అయినప్పటికీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాను ఈ ఏడాది థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నారు. దానికి సంబందించిన డేట్‌కు కూడా దాదాపు ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా నుంచి మరో తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం టీజర్ అతి త్వరాలో రానుందట. మోస్ట్ అవెయిటెడ్ మూకీ ఉప్పెనా టీజర్ త్వరలో  మీ ముందుకి రానుందని మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విటర్ ద్వారా తెలిపారు. దాంతో ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వార్త వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ టీజర్ అభిమానులను మెప్పిస్తుందా… లేదా అనేది.

Related posts