మొదట కాంగ్రెసు హఠావో, దేశ్ కు బచావో అన్నాడు. తర్వాత ఉత్తరాది బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలంటే చులకన అన్నావ్… పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నావ్.. ఇప్పుడు అదే లడ్డు బాగుందని రంకెలేస్తున్నావ్… అన్న ప్రాసన సమయంలోనే పాకుతూ వెళ్లి కత్తి, కొడవలి , ఎర్ర జెండా పట్టుకున్నానని చెప్పావ్. అబద్ధాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసారు ఏపీ మంత్రి పేరును నాని. ఒకే మీటింగ్, రెండు కాల్ షీట్లు… తిరుపతి వచ్చినా వెంకన్న స్వామి గుర్తుకు రాలేదా? విమానం దిగి నోటికి వచ్చింది మాట్లాడి మళ్ళీ విమానం ఎక్కి వెళ్ళి పోయాడు. వివేకానంద రెడ్డి కేసు ఎక్కడ ఉందో ..పవన్ కళ్యాణ్ కు తెలుసా?… పవన్ నాయుడు పార్ట్నర్ చంద్రబాబు నాయుడు హయాంలో కాదా వివేకానంద రెడ్డి హత్య జరిగింది అని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్ట్ గా హోమ్ మంత్రి అమిత్ షా అధీనంలో పని చేస్తుంది… అక్కడ అడగాలంటే భయమా అఙాతవాసి అనుకున్నాం…అఙానవాసి అని కూడా ఇప్పుడు అర్థం అయ్యింది. కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నాడు అని తెలిపారు.
previous post
next post