telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యుద్దాల కోసం .. అమెరికా తగలేసిన ఆస్తులు..

america economy effected on terrorist eradication

యుద్ధం అంటే ఒకటికి వందసార్లు ఆలోచించి, ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ప్రపంచంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల పేరుతో ప్రపంచంలోని 80 కి పైగా దేశాల్లో అమెరికా యుద్ధం చేసింది. ఇప్పటికి చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువ. ఇరాక్, సిరియా, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో అమెరికా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నది. అమెరికా యుద్ధం కోసం దాదాపు 5.9 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఈ యుద్ధాల కారణంగా ఇరాక్, సిరియా, ఆఫ్ఘన్ వంటి దేశాల్లో దాదాపు 5 లక్షల మంది సామాన్య ప్రజలు మరణించారు. యుద్ధములో లక్షలాది మంది మగవాళ్ళు మరణించడంతో.. ఆయా కుటుంబాలను పోషించేదిక్కు లేక రోడ్డున పడ్డాయి. అంగవైకల్యంతో చిన్నారు బాధపడుతున్నారు.

అమెరికా ఉగ్రవాద నిరోధం పేరుతో ఫైట్ చేస్తున్నది కాబట్టి.. ఒకవేళ యుద్ధం ఆపేసినా..ఆయా దేశాలకు అమెరికా నిధులను ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీని కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఇప్పటికే దారుణంగా దెబ్బతిన్నది. నిరుద్యోగం తాండవిస్తోంది. దీంతో అమెరికాలో అక్రమాలు మొదలయ్యాయి. లూటీలు చేస్తున్నారు. గన్ కల్చర్ పెరిగింది. అమెరికా అలోచించి ఈ డబ్బును మంచి పనులకోసం వినియోగించి ఉంటె ఎంతో మందికి దారిచూపించినట్టు అయ్యేది. యుద్ధం కోసం డబ్బు ఖర్చు చేయడం అంటే.. బూడిలో పోసినట్టే కదా.

Related posts