ఎన్నో డిస్కౌంట్లు చూశాం కానీ, మద్యం కొనుగోళ్లపై కూడా అంటే.. ఇంక బాబులు ఆగుతారా.. ఏపీలో.. మద్యం ప్రియులకు.. బెల్ట్ షాప్ యజమానులు భలే ఆఫర్లు ప్రకటించారు. దీంతో.. మునుపెన్నడూ లేని రీతిలో మద్యం అమ్మలు జోరందుకున్నాయి. దుకాణాదారులు మద్యం అమ్మకాలపై భారీ డిస్కాంట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. దొరికిందే.. సందు అనుకున్న మద్యం ప్రియులు.. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేస్తున్నారు. దాదాపు రూ.2 వేలు విలువ చేసే.. ఖరీదైన మందు బాటిల్‌కు.. రూ.300లకు పైగా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక ఒకేసారి మూడు లేదా నాలుగు బాటిళ్లు కొంటే.. టూరిస్ట్ బ్యాగులు, లెదర్ బ్యాగులు, కొన్ని కొన్ని షాపుల్లో అయితే.. ఫర్నీచర్‌ను కూడా ఇస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం మద్యం కొత్త పాలసీని.. అక్టోబర్ 1వ తేదీ నుంచే విక్రయాలను నిర్వహించనుండటంతో.. మద్యం దుకాణాదారులు.. ఉన్న సరుకును క్లియర్ చేసుకోవడానికి ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. నగరాల్లో.. పట్టణాల్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కనుక.. అందుకు అనుగుణంగా భారీగా సరుకును నిల్వ చేసుకుంటారు మద్యం దుకాణాదారులు.. ఇప్పుడు ఆ సరుకును అమ్మడానికి నానా కష్టాలు పడుతున్నారు. అదీకాకా.. రెండేళ్లకోసారి షాపు లైసెన్స్ గడువు ముగిసే సమయంలో మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్ శాఖ తీసుకుంటుంది. తిరిగి.. మళ్లీ తమకే లైసెన్స్ వస్తుందనే ఛాన్స్ లేదు. దీంతో.. సరుకును నిల్వ చేసుకుని.. లైసెన్స్ దక్కక చాలా మంది నష్టపోయిన వారున్నారు. అయితే.. ఈ సారి మద్యం వ్యాపారం పూర్తిగా ప్రైవేటు పరం కానున్నందున.. వ్యాపారస్తులు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. ఉన్న సరుకుని.. ఎంతోకంతకు.. ఆఫర్లు ఇచ్చి ఇలా అమ్మేసుకుంటున్నారు.