ఇటీవల ఎన్నికలలో ఘోరపరాజయం తరువాత తాజా తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలుసు. చరిత్రలో లేని విధంగా ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తింది. ఇక ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోకుండానే చాలామంది నేతలు బీజేపీ తీర్ధం పుచ్చేసుకోవడం పార్టీకి ఇంకా నష్టం కలిగించింది. అటు కొందరు నేతలు తప్ప మిగతవారు పార్టీ బలోపేతానికి ఏ మాత్రం కృషి చేయకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఏపీలో పరిస్తితి ఇలా ఉంటే తెలంగాణలో అయితే టీడీపీ పరిస్తితి చెప్పన్నక్కర్లేదు. అక్కడ దాదాపు కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్న నేతలు బీజేపీలో చేరిపోవడంతో తెలంగాణలో టీడీపీ కథ ముగిసిపోయేనట్లే అనిపిస్తోంది. అయితే మొన్నటివరకు ఒక వెలుగు వెలుగిన టీడీపీ ఇప్పుడు దారుణ స్థితిలో ఉండటంతో, అధినేత చంద్రబాబు పార్టీ మైలేజ్ తెచ్చే నాయకుడు కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అలా పార్టీకి మైలేజ్ తెచ్చేది జూనియర్ ఎన్టీఆరే అని బాబు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సన్నిహిత నేతలతో జూనియర్ ని మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యేలా చేసేందుకు రాయబారాలు నడుపుతున్నారని సమాచారం.
గత ఎన్నికల్లో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లని పార్టీలోకి రప్పించి ఏదొక పదవి ఇవ్వాలని బాబు అనుకున్నారు. బాలకృష్ణతో కూడా రాయబారం నడిపారు. కానీ ఎన్టీఆర్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అక్క సుహాసిని కూకట్ పల్లి నుండి పోటీ చేసిన పార్టీకి దూరంగానే ఉన్నారు. చంద్రబాబు వాడుకుని వదిలేస్తారనే ఎన్టీఆర్ దూరంగా ఉన్నట్లు ప్రచారం కూడా వచ్చింది. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ కోసం ఎంత కష్టపడి ప్రచారం చేశారో అందరికీ తెలుసు. ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ ప్రమాదానికి గురైన బెడ్ మీద నుండే ప్రచారం చేశారు. అలాంటి ఎన్టీఆర్ ని ఎన్నికల తర్వాత దూరం పెట్టేశారు. అప్పటి నుంచి హరికృష్ణ మరణం వరకు ఎన్టీఆర్ ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక తాజాగా కూడా చంద్రబాబు హరికృష్ణ సంవత్సరీకానికి హాజరై ఎన్టీఆర్ తో ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చి మైలేజ్ పెంచుకుందామని చూస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ చంద్రబాబు రాయబారాలకి లొంగి పార్టీలోకి వస్తారా..? లేక వాడుకుని వదిలేస్తారేమో అని సైలెంట్ గా ఉంటారో చూడాలి!!
జానారెడ్డి పెద్ద కొడుకుగా ఉంటా : రేవంత్ రెడ్డి