బాలాపూర్ పురవీధుల్లో గణేశుడి ఊరేగింపుగా నిమజ్జనానికి కదిలాడు. ఈ ఊరేగింపు కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. బాలాపూర్ వినాయకుడు అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది లడ్డూ వేలం. ఆ వినాయకుడి లడ్డూకు ఉన్న ప్రాధాన్యత తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా ఉండదు.
ఈ కార్యక్రమం అనంతరం లడ్డూ వేలం పాట జరగనుంది. గత ఏడాది రూ.16.60లక్షలు బాలాపూర్ లడ్డూ పలికింది. ఈ సారి బాలాపూర్ లడ్డూ కోసం 19మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది 17 లక్షలపైనే లడ్డు వేలం ఉండవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అనంతరం బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 18 కి.మీ. పాటు శోభాయాత్ర కొనసాగనుంది.
ఆ అజయ్ కౌండిన్య గాడిని మహిళలే తన్నుతారు… : రాకేష్ మాస్టర్