telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

జీలకర్ర నీళ్ళు తాగితే…?

Jeera

పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే బరువు తగ్గుతారని చాలా మంది అది పాటించేవారు. రాను రాను దీనికి కాస్తా అడ్వాన్స్‌గా జీరా వాటర్ వచ్చి చేరింది. అవును.. నీటిలో జీలకర్ర వేసి మరిగించాలి. ఈ నీటిని తాగితే నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. జీలకర్రలోని ప్రత్యేక గుణాలు శరీరంలోని అధిక కొవ్వుని తగ్గిస్తాయి. జీలకర్ర వేసిన నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. ఈ నీరు తాగడంవల్ల జీర్ణ సమస్యలు దూరమై. జీర్ణాశయం శుభ్రం అవుతుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి ఇలాంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. జీలకర్ర నీరు తాగడం వల్ల కొవ్వు తగ్గడమే కాదు. అనేక సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా కిడ్నీ రాళ్ల సమస్య దూరం అవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో చేరిన వ్యర్థాలు దూరం అవుతాయి. అంతేకాదు, నీళ్ల విరేచనాలు దూరం అవుతాయి. కొన్ని సార్లు కాస్తా డిప్రెషన్‌గా ఫీల్ అవుతాం.. అలాంటప్పుడు జీలకర్రని మరిగించి అందులో నిమ్మరసం, తేనె కలిపి టీలా తీసుకుని చూడండి.. క్షణాల్లో సమస్య దూరం అవుతుంది. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల చాలా వరకూ యాక్టివ్‌గా ఉంటాం. అనేక కారణాల వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటాం. అలాంటప్పుడు జీలకర్రని దోరగా వేయించి పొడి చేసి ఆ దానిని తేనెతో కలిపి తీసుకోవడంతో పాటు జీలకర్రతో టీలా చేసుకుని తాగండి.. ఇలాంటి చేస్తే సమస్య తగ్గిపోతుంది. అదే విధంగా… షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా జీలకర్ర నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుంది. జీలకర్ర నీరు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులోకి వస్తాయి. అందుకే రెగ్యులర్‌గా వీటిని తాగుతుండాలి. అంతేకాకుండు జీలకర్ర నీరు తాగేవారికి రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడి గుండె సమస్యలు రావు.

Related posts