telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

భారీ లాభాలలో .. స్టాక్ మార్కెట్లు…

husge loses again in stock markets

నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో పరుగెడుతున్నాయి. ఆరంభంలో ప్రతికూలంగా ఉన్న సూచీలు ట్రేడర్ల కొనుగోళ్లతో పుంజుకున్నాయి. సెన్సెక్స్‌218 పాయింట్లు ఎగిసి 39653 వద్ద ఉండగా, నిప్టీ 66 పాయింట్లు లాభపడి 11862 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా నిఫ్టీ 11860ని అధిగమించింది. అమెరికా చైనా మధ్య ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందన్న వ్యాఖ్యలు ఈ పాజిటివ్ ట్రెండ్ కి కారణంగా నిపుణులు చెపుతున్నారు.

బ్యాంకింగ్‌తోపాటు దాదాపు అన్ని షేర్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ 350పాయింట్లు ఎగిసింది. మరోవైపు రేపు (గురువారం) ఎఫ్‌ అండ్‌ వో చివరి రోజు కావడంతో షార్ట్‌ కవరింగ్‌ కనిపిస్తోంది. ఫార్మా, రియల్టీ, మెటల్‌, బ్యాంక్ నిఫ్టీ లాభపడుతుండగా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ స్వల్పంగా నష్టపోతున్నాయి. అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌, ఓఎన్‌జీసీ ఎన్‌టీపీసీ, యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ లాభపడుతుండగా, బ్రిటానియా, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, హీరో మోటో, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్, ఐటీసీ, టాటా మోటార్స్‌ నష్టపోతున్నాయి. ఇంకా అరబిందో, సన్‌ ఫార్మా, కేడలా హెల్త్‌, బయోకాన్‌, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, రియల్టీ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, బ్రిగేడ్‌, శోభా, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ లాభపడుతున్న వాటిల్లో ఉన్నాయి.

Related posts