telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేటి జగన్ సమీక్ష : .. గత సీఎం, మంత్రులపై చర్యలకు ఆదేశాలు..

apcm committee on school fee

ఏపీసీఎం జగన్‌ నేటి సమీక్షలో భాగంగా కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై దృష్టి పెట్టారు. విద్యుత్‌ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన పనులు, చెల్లింపులపై చర్చించారు. అధిక రేట్లకు విద్యుత్‌ ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన సంబంధింత అధికారులను ప్రశ్నించారు.

నేటి సమీక్షలో గత ప్రభుత్వ నిర్వాకం వలన ఖజానాకు రూ.2, 636 కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడైంది. ఈ డబ్బును కంపెనీల నుంచి రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలు రద్దు చేసుకోవాలని జగన్‌ ఆదేశించారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, ఈ అవినీతిని తేల్చేందుకు కేబినెట్‌ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అప్పటి సీఎం, మంత్రిపై న్యాయపరమైన చర్యలకు జగన్‌ ఆదేశించారు.

Related posts