telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ పవన్ ప్రమాదవశాత్తు హిట్ అయ్యాడు… కత్తి మహేష్

kathi-srireddy

శ్రీరెడ్డి, కత్తి మహేష్ వివాదాల విషయంలో ఇద్దరూ ఇద్దరే. అయితే ఈ ఇద్దరి కామన్ పాయింట్ పవన్ కళ్యాణ్. ఆయన పేరు చెబితే ఈ ఇద్దరూ అంతెత్తున లేస్తారు.  అలాంటిది ఈ ఇద్దరూ అందులోనూ శ్రీరెడ్డి.. కత్తి మహేష్‌ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను ఆచరణలో పెట్టింది శ్రీరెడ్డి. కత్తి మహేష్‌ను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసింది. ఇద్దరు కాంట్రవర్శి వ్యక్తులు కాబట్టి కాంట్రివర్శి ప్రశ్నలతోనే ఇంటర్వ్యూ మొదలుపెట్టింది శ్రీరెడ్డి. రావడం రావడం రావడమే తనకు బాగా ఇష్టమైన బోల్డ్ కంటెంట్‌తో ఇంటర్వ్యూ ప్రోమో మొదలుపెట్టింది శ్రీరెడ్డి. ‘ఎప్పుడు మీ వర్జినిటీ పోగొట్టుకున్నారు’? అని సూటిగా సిగ్గులేకుండా ప్రశ్నించడంతో అంతే సిగ్గులేకుండా ఆన్సర్ ఇచ్చాడు కత్తి మహేష్.. ‘పోగొట్టుకోవడం అంటే అది యాక్సిడెంటల్ థింగ్.. మ్యారేజ్ అప్పటికి అది జరిగింది.. ఒక అనుభవంతో అలా పెద్ద మనిషి అయ్యా’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు కత్తి మహేష్.

ఎవర్నైనా లవ్ చేశారా? కొంపతీసి నన్ను లవ్ చేయడం లేదు కదా? అంటూ మరో ప్రశ్న వదిలింది శ్రీరెడ్డి. దీనికి ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చాడు కత్తి మహేష్. ‘వై.. నాట్.. అసలు నిజానికి మనం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రోజూ కోరుకుంటున్నారు. నాకు ఇంకా విడాకులు కాలేదంటూ’ సస్పెన్స్ క్రియేట్ చేశారు కత్తి మహేష్. మీరు క్రిటిక్ కదా.. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? అని శ్రీరెడ్డి ప్రశ్నించగా.. కత్తి మహేష్ ఎవరు పేరు చెప్పారన్నది సస్పెన్స్‌లో పెట్టింది శ్రీరెడ్డి. అయితే రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం లేదా? అని మరో ప్రశ్న వేయగా.. ఆయన్ని లాస్ట్ జనరేషన్ డైరెక్టర్‌లలో పెట్టేశా అంటూ చెప్తూ తనకు చిన్నప్పటి నుండి లాయర్ అవ్వాలనే కోరిక ఉండేదని అందుకే ప్రశ్నలు సంధిస్తూ ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు కత్తి మహేష్.

మీకు రాజకీయాల్లో ఏ పార్టీ అంటే ఇష్టం అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే తనకు ఇష్టమని చెప్పారు కత్తి మహేష్. ఆంధ్రప్రదేశ్‌లో నెక్స్ట్ లెవల్‌లో ఉన్న వైసీపీ అంటే ఇష్టం అని చెప్పారు. అయితే వైసీపీ తరుపున పోటీచేయడానికి టికెట్ ఆశించిన మాట వాస్తవమే అని.. వాళ్లు సీటు ఇవ్వలేదు కాబట్టి పార్టీ జెండా కప్పుకోలేదన్నారు కత్తి మహేష్. సినిమా ఇండస్ట్రీలో దళితులు హీరోలుగా ఎందుకు రావడంలేదంటూ శ్రీరెడ్డి అడిగిన ప్రశ్నకు అసలు కారణం వివరించారు కత్తి మహేష్. ఇండస్ట్రీలో నిర్మాతలు దళితులు లేరు కాబట్టి.. దళిత హీరోలు రావడం లేదు. అదే దళిత నిర్మాతలు ఉంటే దళితులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. వాస్తవంలో కమ్మ, కాపుల డామినేషన్ ఇండస్ట్రీలో ఉంది. వ్యవస్థే కులంపై నడుస్తుంది ఇండస్ట్రీ కూడా అంతే అంటూ క్లారిటీ ఇచ్చారు కత్తి మహేష్.

మెగా ఫ్యామిలీలో 9 మంది హీరోలు ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే వాళ్ల ముఖం బాలేకపోయినా.. మూతి బాలేకపోయినా వాళ్లను అభిమానించే పిచ్చోళ్లు తయారయ్యారు. చాలా సినిమాలకు మార్నింగ్ షో తరువాత ఫ్యాన్స్ కూడా థియేటర్‌లో లేని సినిమాలు వాళ్లవి చాలా ఉన్నాయి’ అంటూ మెగా హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు కత్తి మహేష్. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘అసలు పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వస్తే.. ఎవరు పట్టించుకునేవారు.. 12 ఫెయిల్ అయినవాడికి ఇంట్లో బాయ్‌గా కూడా ఉద్యోగం ఇవ్వరు. పవన్ ప్రమాదవశాత్తు హిట్ అయ్యాడు.. ఎందుకు హిట్ అయ్యాడో అతనికే తెలియదు. పవన్-చిరు మధ్య ఎప్పుడు రహస్య ఒప్పందం నడుస్తూనే ఉంది. ఎంతైనా వాళ్లు అన్నదమ్ములు. నిజానికి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడు చిరంజీవి. పవన్ కళ్యాన్ అనే వాడికి అసలు ఏమి తెలియదు’ అంటూ శ్రీరెడ్డి ప్రశ్నలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు కత్తి. ఇక పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ కోసం ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, పవన్ ఫ్యాన్స్ ఎలా ప్రవర్తిస్తారు? అన్న దానిపై శ్రీరెడ్డి గుచ్చి గుచ్చి కత్తిని రెచ్చగొట్టడంతో చెలరేగారు కత్తి మహేష్. ‘నిజానికి పవన్ కళ్యాణ్‌కి పబ్లిసిటీ పిచ్చి.. లేకపోతే బొచ్చెలో తినే ఫొటోలు, ఫామ్ హౌస్‌లో ఒంటరిగా ఆవులకు మేత వేసే ఫొటోలు జనానికి ఎందుకు చెప్పండి.. ఇక ఆయన ఫ్యాన్స్‌ గురించి చెప్పాలంటే వాళ్లు ఫ్యాన్స్ కాదు ఉన్మాదులు. అందుకే ఎక్కువ రియాక్ట్ అవుతారు’ అంటూ ఫైర్ అయ్యారు కత్తి మహేష్.

Related posts