telugu navyamedia
సినిమా వార్తలు

సీనియర్ నటి హాట్ ఫోటోలకు నెటిజన్లు ఫిదా

Neena-Guptha

బాలీవుడ్ సీనియ‌ర్ నటి నీనా గుప్తా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం 59 ఏళ్ల వ‌య‌సులో ఉన్న నీనా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఇంతటి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. నీనా పోస్ట్ చేసిన ఫోటోల‌కు నెటిజ‌న్ల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ఆమె ఫోటో పోస్ట్ చేయగానే కామెంట్లు, లైక్‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఈ సోష‌ల్ మీడియా కామెంట్ల గురించి నీనా మాట్లాడారు. “నాకు మోడ‌ర‌న్‌గా, ఫ్యాష‌నబుల్‌గా ఉండ‌డం అంటే చాలా ఇష్టం. అదృష్ట‌వ‌శాత్తూ నాకు అంద‌మైన శ‌రీరం ఉంది. ఈ వ‌య‌సులోనూ నేను దాన్ని కాపాడుకుంటున్నాను. అందంగా క‌నిపించ‌డానికి, ప్ర‌యోగాలు చేయ‌డానికి వ‌య‌సుతో ప‌నిలేదు. నాకు అందంగా అనిపించిన నా ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటాను. వాటికి చాలా మంది కామెంట్లు, లైక్‌లు పెడుతుంటారు. చాలా మంది ప్ర‌శంసిస్తుంటారు. కొద్ది మంది మాత్ర‌మే నెగిటివ్ కామెంట్లు పెడుతారు. మామూలు ఫోటోలు పెడితే వాటికి పెద్ద‌గా రియాక్ష‌న్ ఉండదు” అని నీనా చెప్పారు.

Related posts