telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతికి మరో సర్‌ఫ్రైజ్‌ ఇచ్చిన రవితేజ

టాలీవుడ్ లో రవితేజా ఎప్పటికప్పుడు మాస్ ఎంట్రీలతో, డైలాగ్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాడు. అయితే కొత్త సంవత్సరానికి రవితేజ డబుల్ ధమాకా పేల్చాడు. ఒకవైపు క్రాక్ ట్రైలర్‌తో అందరికి సూపర్ ఎంటర్‌టైన్ చేశాడు. దాంతో పాటుగా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఖిలాడీ సినిమా పోస్టర్ విడుదల చేసి అభిమానులకు పిచ్చెక్కించాడు. ఈ పోస్టర్‌లో రవితేజా రెండు గెటప్స్‌లో ఉన్నాడు. వాటిలో ఒకదానిలో అమాయకంగా ఉన్న రవితేజా మరొకదానిలో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. అభిమానుల్లో ఖిలాడీ పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరని హీరోయిన్లుగా చేస్తున్నారు. డాక్టర్ జయంతీలాల్ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌లపై సత్యనారాయణ దీనిని నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ మూవీ నుంచి మరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసినట్లు పేర్కొంది. ఇక ఈ సినిమా టీజర్‌ అతి త్వరలోనే రానుందని కూడా చిత్ర యూనిట్‌ తెలిపింది.

Related posts