టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అన్ని రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ స్వచ్ఛందంగా మొక్కలు నాటుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన హీరో సుధీర్ బాబు బుధవారం తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ కు సుధీర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఓ మొక్కను నాటి, ఆ సినిమా పేరు పెడుతానని తెలిపారు. ఈ క్రమంలోనే ‘వి’ సినిమాకు గుర్తుగా బుధవారం తన నివాసంలో మొక్కలు నాటానని ఆయన వెల్లడించారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, హీరోయిన్లు నివేదా థామస్, అదితీరావు హైదరీలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు సుధీర్ బాబు.