telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

నిర్భయ నిందితుల ఉరి .. లైవ్ ప్రసారం చేయాలి.. డిమాండ్!

Refusal to nirbhaya apologize

నిర్భయ కేసుపై పెద్ద ఎత్తున నిరసనలు, ఫలితంగా నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే ఆ నీచులలో ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించగా.. మరొకరు టీనేజర్ అని ఉరి నుండి తప్పించుకున్నాడు. అయితే మిగితా నలుగురు గత 8 ఏళ్ళ నుండి జైల్లోనే ఉన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిందితులకు ఉరి శిక్ష ఖరారైంది. అధికారుల నుంచి పలానా రోజు ఉరి తీస్తున్నామని ప్రకటన ఇప్పటికి రాకపోయినా.. తలారి కోసం వెతుకులాట, ఉరి తాళ్లను సిద్దం చెయ్యడం, ఆ ఉరి గదిని శుభ్రపరచడం లాంటి పనులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వారిని త్వరలోనే మరణ శిక్ష ఖాయమని ప్రచారం రోజురోజుకూ జోరందుకుంటుంది. అయితే నిర్భయ దోషుల ఉరి శిక్షకు సంబంధించి సుప్రీంలో సంచలన పిల్ దాఖలైంది.

ఆ నలుగురు దోషులకు ఉరి వేయడాన్ని టీవీ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని, అమెరికాలో మాదిరిగానే నిర్భయ కుటుంబసభ్యుల సమక్షంలో దోషులను ఉరి తియ్యాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. అయితే ఉరి శిక్ష మరికొన్ని రోజులు ఆలస్యం కానుంది. దోషిగా నిర్ధారించిన అక్షయ్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నెల 17న ఈ పిల్‌పై మరోసారి వాదనలు జరగనున్నాయి. కాగా మిగిలిన ముగ్గురు దోషులు గతంలోనే రివ్యూ పిల్స్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు వాటిని తిరస్కరించింది. మరి ఈ అక్షయ్ విషయంలో ఎం అవుతుందో చూడాలి.

Related posts