telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలుగు రాష్ట్రాలకు .. నేటి నుండి .. వర్ష సూచన..

rains in june

అరేబియా సముద్రంలో పడమర గాలుల ప్రభావంతో బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా వచ్చే రెండు మూడు రోజుల్లో ఒడిశా తీరంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావం వల్ల నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఫలితంగా భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. ఈ నెల 23 వరకు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో ఇంకా ఏపీలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Related posts