telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డర్టీ హరి : “లెట్స్ మేక్ లవ్” సాంగ్ రిలీజ్

Dirty-Hari

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘డర్టీ హరి’. హైదరాబాద్ కుర్రాడు శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోయిన్లు. సమర్పకులు గూడూరు శివరామకృష్ణ, నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్. ఈ చిత్రంలో రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ ముఖ్య పాత్రలను పోషించారు. మార్క్ కె. రాబిన్ సంగీతం సమకూర్చారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇప్పటికి ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 1 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర ప్రచారంలో భాగంగా తొలి పాట ‘లెట్స్ మేక్ లవ్’ను విడుదల చేశారు. పూర్తి వీడియో పాటను ఈనెల 24న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదలైన మా ‘డర్టీ హరి’ ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన లభించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. రొటీన్‌కి భిన్నంగా ప్రయత్నిస్తున్న మా డైరెక్టర్ ఎం.ఎస్.రాజు గారు కథని మలిచిన విధానం యూత్‌ని బాగా ఆకట్టుకోనుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ చిత్రంలోని మొదటి పాట ‘లెట్స్ మేక్ లవ్’ పూర్తి వీడియోతో ఈ నెల 24న మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

Related posts