telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటుడు “శోభన్ బాబు” 16 వర్ధంతిని అభిమానుల సంఘం ఘనంగా నిర్వహించింది.

సినీనటుడు శోభన్‌బాబు 16వ వర్ధంతిని బుధవారం విశాఖపట్నంలో శోభన్‌బాబు అభిమానుల సంఘం ఘనంగా నిర్వహించింది.

ముఖ్యంగా శోభన్‌బాబు వర్ధంతి సందర్భంగా అభిమానుల సంఘం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆ అభిమానుల సంఘం లో ఒకరైన, దొడ్డి వెంకటరావు మాట్లాడుతూ: విశాఖపట్నంలో తన హిట్ చిత్రం “దొరబాబు” చిత్రీకరణ జరిగినప్పుడు ప్రముఖ నటుడి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు.

అప్పుడే శోభన్ బాబుతో వెంకటరావుకు స్నేహం ఏర్పడింది.

అతను గుర్తుచేసుకున్నాడు “ఆ రోజుల్లో బ్రాండెడ్ బట్టలు లేవు. అలా శోభన్‌బాబు లాంటి స్టార్‌ నటుల కాస్ట్యూమ్స్‌ టైలర్‌ చేసే అవకాశం వచ్చింది.

షూటింగ్‌ గ్యాప్‌ సమయంలో శోభన్‌బాబు నాతో మాట్లాడేవారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలో మరియు ఆర్థికవ్యవహారాలను ఎలా నిర్వహించాలో అతను నాకు మార్గనిర్దేశం చేశారు.

దొడ్డి వెంకటరావులాగే వైజాగ్‌లో శోభన్‌బాబు గారి కి దాదాపు 60 మంది అభిమానులు ఉన్నారు. ప్రతి నెలా సంఘానికి రూ.100 అందజేస్తారు.

ఏటా దివంగత సినీనటుడు శోభన్‌బాబు పుట్టినరోజు మరియు వర్ధంతి సందర్భంగా వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు రూ.60,000 నుండి రూ.70,000 వరకు ఖర్చు చేస్తారు.

కొణతాల చిన్న వెంకటరావు కూడా శోభన్ బాబుకి పెద్ద అభిమాని. నటుడు మరణించిన తరువాత అతను నగరంలో దివంగత నటుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. కాని అధికారులు దానికి భూమిని కేటాయించలేదు.

ఆ తర్వాత కంచరపాలెంలోని కొణతాల చిన్న వెంకటరావు గారు తన స్వంతం స్థలం లో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.

Related posts