telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి” మా వ్యూ

another single from maharshi movie

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా
నటీనటులు : మహేష్ బాబు, పూజాహెగ్డే, అల్లరి నరేష్
దర్శకుడు : వంశీ పైడిపల్లి
నిర్మాత : దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి పొట్లూరి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: కె.యు. మోహనన్‌

మనం రోజూ చదివే రైతు ఆత్మహత్యలను, వినే రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకుని మహేష్ ఈసారి “మహర్షి”గా మారాడు. మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ప్రదర్శితమైన ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభించింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రిన్స్ అభిమానులను ఎంతమేరకు ఆకట్టుకుందో చూద్దాము.

కథ :
అమెరికన్ బేసెడ్ అరిజన్ కంపెనీ అధినేత రుషి కుమార్ (మ‌హేష్ బాబు). అతను ఓటమి అంటే భయంతో ఎప్పుడూ గెలుపు కోసం ప్రయత్నిస్తూ బిజినెస్ లో దూసుకుపోతూంటాడు. అతని జీవితం ఓ సర్పైజ్ పార్టీతో మారిపోతుంది. ఆ పార్టీలో తను చదువుకున్న వైజాగ్ ఐఐఈటీ ప్రొపెసర్ (రావు రమేష్) ని, కాలేజీ మేట్స్ అందరినీ కలుస్తాడు. అయితే ఆ పార్టీకి తన జీవితంలో అత్యంత ముఖ్యలైన ఇద్దరు రాకపోవటం గమనిస్తాడు. వాళ్లలో ఒకరు తన మాజీ ప్రేయసి (పూజా హెగ్డే), తన క్లోజ్ ఫ్రెండ్ రవి (అల్లరి నరేష్). పూజ రాకపోవటానికి కారణం… ఆమెతో అయిన బ్రేకప్ అని అర్దమవుతుంది. కానీ రవి ఎందుకు రాలేదనేది అర్దం కాదు. అప్పుడు రవి గురించి ఓ విషయం తెలుస్తుంది. అప్పుడు రవి కోసం ఇండియా బయిలుదేరి వస్తాడు. అక్కడి పరిస్థితులు చూశాక అతను రైతుగా మారతాడు. పెద్ద కార్పోరేట్ సంస్ద యజమాని వివేక్ మిట్టల్ (జగపతిబాబు)తో తలపడతాడు. అసలు రవి ఎందుకు ఆ పార్టీకు రాలేదు? రుషి తన వ్యాపారాలన్నిటికి అర్జెంటుగా సెలవు పెట్టి ఆ విలేజ్ కు ఎందుకు వెళ్లాడు? అసలు ఆ విలేజ్ లో ఏం జరుగుతోంది? కోటీశ్వరుడైన రిషికి రైతుగా మారాల్సిన పరిస్దితి ఎందుకు వచ్చింది? రిషికు అతని గర్ల్ ప్రెండ్ పూజకు మధ్య బ్రేకప్ కు కారణం ఏమిటి ? రవి కథ ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
న‌టుడిగా మ‌హేష్‌ పాత్ర‌లో మూడు షేడ్స్ ఉండడంతో త‌న‌లోని వైవిధ్యాన్ని చూపించుకునే అవ‌కాశం ద‌క్కింది. సీఈఓగా స్టైలిష్‌గా క‌నిపించిన మ‌హేష్, విద్యార్థిగా మాస్‌ని అల‌రిస్తాడు. రైతు స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తున్న‌ప్పుడు త‌న‌లోని సిన్సియారిటీ క‌నిపిస్తుంది. మ‌హేష్ తెర‌పై ఎప్పటిలాగే అందంగా క‌నిపించాడు. ఇక సినిమాలో కీలక పాత్ర పోషించిన అల్లరి నరేష్ కీలక విజయం అందుకుని చాలా కాలమైన అల్ల‌రి న‌రేష్‌కి ఇందులో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ దక్కింది. నిజంగానే కథలో కీలకంగా నిలిచాడు. అల్లరి నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇక కథానాయికగా వరుస సినిమాలను చేస్తున్న పూజాహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది. పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది. జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి స్టైలిష్ విల‌న్‌గా ఆక‌ట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి బలమైన కథనే ఎంచుకున్నాడు. అందుకు మహేష్‌ ను ఎంచుకోవడంతో ఈ కథకు మరింత బలం చేకూరింది. కానీ నిడివి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది. సంభాష‌ణ‌లు స‌హ‌జంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలను కట్ చేసి ఉంటే బాగుండేది అన్పిస్తుంది. దేవిశ్రీ పాటలు బాగున్నాయి. ఇక నేప‌థ్య సంగీతంలో బాగుంది. మహేష్‌ సినిమా కావడంతో ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

రేటింగ్ : 3/5

Related posts