telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆదిపురుష్”లో ఈ క్యారెక్టర్ పోషించడం ఎంతో గర్వకారణం : ప్రభాస్

Prabhas

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ తో ఓ సినిమా ఉందని వస్తున్న వార్తలను నిజం చేస్తూ “ఆదిపురుష్” అనే మరో భారీ పీరియాడిక్ వండర్ కు ప్రభాస్ శ్రీకారం చుట్టారు. ఎట్టకేలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న తన 22వ చిత్రం అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించగా హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కించి మిగతా భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారట. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ ను నార్మల్ గానే కాకుండా ప్రభాస్ ఇది వరకు టచ్ చెయ్యని 3డి టెక్నాలజీలో తెరకెక్కించనున్నారు. అలాగే ఈ చిత్రం శ్రీమహావిష్ణు మొట్టమొదటి అవతారం “ఆదిపురుషుడు” ఆధారంగా చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే మన దేశపు ఇతిహాసంను అనుసరించి తెరకెక్కనుంది. కాగా తన కొత్త చిత్రం టైటిల్ ‘ఆదిపురుష్’పై హీరో ప్రభాస్ స్పందిస్తూ “ప్రతి పాత్ర, ప్రతి అవకాశం వెనుక ఎన్నో సవాళ్లుంటాయి. కానీ, ఈ తరహా క్యారెక్టర్ ను పోషించడం ఎంతో గర్వకారణం. బాధ్యతగా చేయాల్సిన పాత్రిది. ఈ పాత్రను పోషించేందుకు చాలా ఆసక్తితో ఉన్నాను. ఈ క్యారెక్టర్ ను ఓమ్ డిజైన్ చేసిన తీరు అద్భుతం. దేశ యువత, ఈ చిత్రాన్ని ఆదరిస్తుందన్న నమ్మకం నాకుంది” అని ప్రభాస్ వ్యాఖ్యానించారు.

Related posts