telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొత్త బిల్లుల కారణంగా రైతుల సంపాదన పెరుగుతుంది…

Rajnath singh Bjp

ప్రస్తుతం ఢిల్లీలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన మరింత ఉద్రిక్త పిరిస్థితి చేరుకుంది. ఇటీవల రైతులు, కేంద్రం మంధ్య మరో విడత చర్చలు జరిగాయి. అమలు కానున్న మూడు వ్యవసాయ బిల్లులను వెనక్కుతీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దానికి కేంద్రం ఒప్పుకోవడం లేదు. అయితే ఇదే అదునుగా తీసుకొని కొందరు రైతులను వ్యవసాయ బిల్లులపై తప్పుడు సమాచారం ఇచ్చి ఉసిగొల్పుతున్నారని, ఆ పప్పులు ఇక్కడ ఉడకవని, అది ఎవరైనా వారి ప్లాన్‌లు ఫలించవని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ కొత్త బిల్లుల కారణంగా రైతుల సంపాదన పెరుగుతుందని, కానీ కాంగ్రెస్ వారిని తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. ఈ బిల్లులు చట్టాలుగా మారిన కొన్నాళ్లకు మంచి పరిణామాలు కనబడతాయని చెప్పారు. 1991లో వచ్చిన ఆర్థిక చట్టాలు దీనికి ఉదాహరణా నిలుస్తాయి. అప్పట్లో ఈ ఆర్థిక చట్టాలు పాజిటివ్ ఫలితాలు చూపేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పట్టిందని తెలిపారు. అంతేకాకుండా దేశంలో మండీలను నిర్మూలిస్తామని, రైతులకు సగటు ధరను కూడా లేకుండా చేస్తామన్నారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts