telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేజీబీవీల్లో బాలిక‌ల‌కు నాణ్యమైన విద్య: మంత్రి అల్లోల

indrakaran reddy

కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బాలిక‌ల‌కు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలంగాణ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా న‌ర్సాపూర్-జి మండ‌ల కేంద్రంలో ఈరోజు కస్తుర్బా గాంధీ బాలికల పాఠ‌శాల‌ను మంత్రి ఇంద్ర‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందనిస్పష్టం చేశారు. పేదవర్గాలకు చెందిన బాల‌, బాలిక‌ల‌కు ఉచిత విద్యతోపాటు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసిఆర్ విద్యారంగంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.

ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థినులే కస్తుర్బా గాంధీ పాఠశాలల్లో చ‌దువుకుంటున్నారు. పదవ తరగతి చదువు పూర్తవగానే చాలా మంది పేద విద్యార్థినులు చదువు మానేసి ఇంటి వద్ద తల్లిదండ్రులకు సాయంగా పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పదోతరగతి వరకు ఉన్న కస్తూర్బా విద్యాలయాల స్థాయిని ఇంటర్ వరకు పెంచింద‌ని మంత్రి పేర్కొన్నారు.

Related posts