telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ కు హెడ్ మసాజ్ చేసిన కూతురు సితార..

mahesh

ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు మిస్ అయిన టైమ్ అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. పిల్లలతో మహేష్ బాబు జాళీగా పిల్లలతో గడుపుతున్న ఫోటోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా మహేష్ బాబుక కూతురు సితార హెడ్ మాలిష్ చేయించుకుంటున్న ఫోటో ను నమ్రత తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. గౌతమ్ తన ఆట తాను ఆడుకుంటున్నాడు. ఈ లోగా మహేష్ హెడ్ మసాజ్ వాలంటీర్ అయ్యాడని పేర్కొంది. తన తండ్రికి దాదాపు 2 నిమిషాలపాటు మసాజ్ చేసింది. నాన్న హెడ్‌ మసాజ్‌ నచ్చిందని చెప్పడంతో తను చాలా ఆనందపడ్డానని సితార చెప్పారు. మొత్తానికి కరోనా లాక్‌డౌన్‌ను మహేష్ బాబు బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఈ యేడాది మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

Related posts