telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

రైతు బంధు చెక్కులు 10లోగా ఇస్తేనే .. ఎన్నికలలో పాల్గొంటాం.. : గ్రామీణ తెలంగాణ

village farmers warning to trs on raitubandu cheq

తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన రైతులు, రైతు బంధు చెక్కులు అందకపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు చెక్కులను అందించకుంటే లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ఈ ఎన్నికల్లో ఓటేయబోమని స్పష్టం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో చోటుచేసుకుంది.

ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు చెక్కులు జిల్లాలోని కేశుపల్లి గ్రామ రైతులకు అందలేదు. అధికారులను ఈ విషయమై పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీనితో చివరికి విసిగిపోయిన గ్రామస్తులు లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. ఈ నెల 10లోగా రైతు బంధు చెక్కులు తమకు అందేలా చర్యలు తీసుకోవాలనీ, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయమై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఇంతవరకూ స్పందించలేదు.

Related posts