telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సచివాలయం కూల్చివేత పనులు పున: ప్రారంభం!

secretariate atelangana hyd

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతి లభించడంతో కూల్చివేత పనులు పున: ప్రారంభమయ్యాయి. ఇటీవలే కూల్చివేతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కూల్చివేతలు పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్ పిటిషన్లు వేశారు. వారం రోజులుగా ఈ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించి, దాఖలైన పిటిషన్లను కొట్టేసింది.

ఈ నేపథ్యంలో సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో, కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సెక్రటేరియట్ ను కూల్చవచ్చని తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.

Related posts