telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్టీసీ సిబ్బందికి పోలీసు విధులు!

rtc employees police duty

గుజరాత్ లో ఆర్టీసీ ఉద్యోగులు పోలీసు విధులు నిర్వహిస్తున్నారు. సూరత్ లోని బర్డోలిలో జీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పోలీసుల విధులను చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో బార్డోలీ పోలీసులు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నారు. దీంతో, ఆర్టీసీ సిబ్బంది సేవలను వినియోగించుకుంటామని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ విజయ్ రబారీని పోలీసు అధికారులు సంప్రదించారు. దీనికి మేజిస్ట్రేట్ అంగీకరించారు.

ఈ సందర్భంగా పోలీస్ ఇన్స్ పెక్టర్ గిలాటర్ మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, పట్టణంలో తిరిగేలా వారికి గుర్తింపు కార్డులను అందించామని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ ప్రవీణ్ కులకర్ణి మాట్లాడుతూ, సూరత్, బార్డోలి మధ్య బస్సును నడిపేవాడినని… ఇప్పుడు పోలీసు విధులను నిర్వహిస్తుండటం ఆనందంగా ఉందని తెలిపాడు.

Related posts