తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 19న తెలంగాణ బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పట్టు వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు, 17న ధూంధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు.