telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ స్టార్ ఆటగాడు ఐపీఎల్ లో ఎందుకు రాణించలేకపోతున్నాడో తెలుసా..?

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్ మరియు ఐపీఎల్ 2020 యొక్క అత్యంత ఖరీదైన (రూ. 10.75 కోట్లు) ఆటగాల్లో ఒకడైన గ్లెన్ మాక్స్వెల్ అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే తన వైఫల్యానికి కారణాలు ఏంటి అనేది మాక్స్వెల్ స్వయంగా తెలిపాడు. ఈ స్టార్ ఆసీస్ ఆటగాడు మాట్లాడుతూ… ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు తన పాత్ర మారుతూనే ఉంది అని, కానీ ఆస్ట్రేలియా జట్టులో ఆడుతున్నప్పుడు అలా ఉండేది కాదు అని తెలిపాడు. దాదాపు ప్రతి గేమ్‌ లోనూ కొత్త స్థానంలో ఆడటానికి అలవాటు పడాల్సి ఉందని చెప్పాడు.

2019 ప్రపంచ కప్ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియా వన్డే జట్టులో తిరిగి వచ్చిన మాక్స్వెల్ ఇంగ్లాండ్ సిరీస్‌లో బ్యాట్‌తో అబ్బురపడ్డాడు. ఆ సిరీస్ లో ఓ సెంచరీ చేసిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీ కూడా లభించింది. ఐపీఎల్ ‌లో జట్లు తమ ఆటగాళ్లను చాలా మారుస్తాయి. జట్లు సరైన బ్యాలెన్స్ కోసం వెతుకుతూనే ఉంటాయి. కాబట్టి మరీనా ప్రతి స్థానానికి అలవాటు పడటం చాలా కష్టం అని చెప్పాడు. ఐపీఎల్ 2020 లో మాక్స్వెల్ 3, 4 మరియు 5 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఆడిన 7 ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల లో ఇప్పటి వరకు మాక్స్వెల్ 14.50 సగటుతో 58 పరుగులు చేశాడు. 

Related posts