telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వరల్డ్ ఫేమస్ లవర్” ఫస్ట్ లుక్… మరో అర్జున్ రెడ్డి…!

World-Famous-Lover

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా క‌నిపిస్తాడ‌ని టాక్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. మరోసారి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసేలా “వరల్డ్ ఫేమస్ లవర్” ఫస్ట్ లుక్ ఉంది. చేతిలో సిగరెట్, ముఖంపై రక్తపు మరకలతో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు మరో అర్జున్ రెడ్డి అంతటి భారీ హిట్ ను ఇస్తుందేమో చూడాలి.

Related posts