telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమల్ హాసన్ కు కాలు సర్జరీ…?

Kamal-Hassan

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఇండియ‌న్ 2. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు .దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం. శింబు కూడా ముఖ్య పాత్ర చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క‌మ‌ల్ హాస‌న్ 2019 న‌వంబ‌ర్ 7న 65వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే క‌మ‌ల్ హాస‌న్ నేడు ఆసుప‌త్రిలో అడ్మిట్ కానున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2016లో క‌మ‌ల్‌కి ప్ర‌మాదం జ‌ర‌గ‌గా, అత‌ని కాలికి రెండు స‌ర్జ‌రీలు జ‌రిగాయి. తాజాగా మ‌రో స‌ర్జ‌రీ చేసేందుకు డాక్ట‌ర్స్ క‌మ‌ల్‌ని ఆసుప‌త్రిలో అడ్మిట్ కావాల‌ని సూచించారు. ఈ స‌ర్జరీ ఎప్పుడో చేయించుకోవల‌సి ఉన్నప్ప‌టికి, సినిమాలు, రాజ‌కీయాల‌తో ఉన్న బిజీ వ‌ల‌న వాయిదా ప‌డింది. నేడు ఆప‌రేష‌న్ చేసి కాలులో ఉన్న ఇంప్లిమెంట్స్ తొల‌గిస్తార‌ట‌. ఆప‌రేష‌న్ త‌ర్వాత క‌మ‌ల్ కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు.

Related posts