telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అప్పుడు రాహుల్ గాంధీ పిక్నిక్ ఎంజాయ్ చేశారు..

Rahul gandhi congress

బిహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ అద్భుతంగా రాణించింది. కానీ విజయం మాత్రం ఎన్డీఏకు దక్కింది. మహాకూటమికి 110 స్థానాలు వచ్చినప్పటికీ అధికారం రాలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ బీహార్‌ గెలిచి.. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే… ఈ ఓటమిపై ఆర్జేడీ సీనియర్‌ నాయకులు శివానంద్‌ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు తివారీ. 70 స్థానల్లో పోటీచేసిన కాంగ్రెస్‌.. కనీసం 70 ప్రచార సభలు కూడా నిర్వహించలేదని.. ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కేవలం మూడు రోజుల పాటు బీహార్‌కు వచ్చారని ఫైర్‌ అయ్యారు. ప్రియాంక గాంధీ అయితే.. బిహార్‌ ప్రజలకు మోఖం కూడా చూపించలేదన్నారు. దేశమంతా బిహార్‌ ఎన్నికల వైపు దృష్టి సారిస్తే… రాహుల్‌ గాంధీ మాత్రం తన సోదరి ప్రియాంక ఇంట్లో పిక్నిక్‌ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బిహార్‌కు ఏ మాత్రం పరిచయం లేనివారు ప్రచారం చేసేందుకు వచ్చారని తెలిపారు. జాతీయ పార్టీని నడిపే తీరు ఇదేనా ? ఇది సరి కాదు అని తివారీ విమర్శలు గుప్పించారు.

Related posts