telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గెడ్డం గీసుకోడానికి కష్టపడుతున్న బిచ్చగాడు… ఆ పోలీస్ ఏం చేశాడంటే ?

Police

అమెరికా, డెట్రాయిట్‌లోని కామెరికా పార్క్ ఎదుట సెప్టెంబరు 11న భారీగా పెంచిన గెడ్డంతో నీల్సన్ (62) అనే బిచ్చగాడు ఉన్నాడు. అటుగా వెళ్లే ఓ యువతి ఆ బిచ్చగాడిని చూసి గెడ్డం గీసుకోమంటూ రేజర్ ఇచ్చి వెళ్లిపోయింది. ఆ బిచ్చగాడు ఒక చేతిలో రేజర్, మరో చేతిలో నీళ్ల డబ్బా పెట్టుకుని అతి కష్టంగా గెడ్డం గీసుకోడానికి ప్రయత్నించాడు. బిచ్చగాడు పార్క్ ప్రాంతాన్ని పాడు చేస్తున్నాడంటూ చుట్టు పక్కల వాళ్లు దగ్గరలో ఉన్న థామస్ అనే పోలీసు అధికారికి సమాచారమిచ్చారు. థామస్ అక్కడకు చేరుకోగానే నీల్సన్ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే బిచ్చగాడిని చూసిన థామస్‌కు జాలి కలిగింది. బిచ్చగాడి చేతిలోని రేజర్ తీసుకుని తానే స్వయంగా బిచ్చగాడికి షేవింగ్ చేశాడు. అక్కడే ఉన్న ఓ మహిళ ఈ దృశ్యాన్ని ఫొటో తీసి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీస్ అంటే అందరూ తప్పుగానే అర్థం చేసుకుంటారని.. కానీ ఈ పోలీస్ చేసిన దాని గురించి తెలిస్తే పోలీసులపై మరింత గౌరవం పెరుగుతుందంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోను చూసిన వారందరూ థామస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

Related posts