telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవితో స్టెప్పులు వేయనున్న జేజమ్మ !

వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ బిజీ అయ్యారు. ఒకవైపు ఆచార్య సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలను ప్రకటించి అందరని ఔరా అనిపించాడు. అయితే చిరు వరుస సినిమాలు ప్రకటిస్తున్నాప్పటికీ అందులో హీరోయిన్లు దొరకడం కష్టం అయిపోయింది. హీరోయిన్ల విషయంలో చిత్ర టీం తెగ కష్ట పడుతోంది. అయితే ఇటీవల దర్శకుడిని ఓకే చేసుకున్న మెగాస్టార్ లూసిఫర్ సినిమా ఇప్పుడు హీరోయిన్ వేటలో పడింది. అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో హీరోయిన్ పాత్ర లేదంట. కానీ తెలుగు నెగిటివిటీకి అనువుగా మారుస్తూ దర్శకుడు మోహన్‌ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను జోడించారంట. అంతేకాకుండా హీరోయిన్ పాత్రను కేవలం పాటల వరకు పాత్రమే పరిమితం చేస్తారా లేక సీన్స్‌లో కూడా ఉంచుతారా అనేది తేలాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కూడా ఎవరు చేస్తారన్నది తెలియదు. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను ఫైనల్ చేయాలని ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

Related posts