telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ సినిమాకు ఇంటరెస్టింగ్ టైటిల్ ?

Raviteja

మాస్ మహారాజా రవితేజ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్‌ సినిమాలో న‌టిస్తున్నాడు. ఆ తరువాత రవితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల స‌మాచారం ప్రకారం ఈ సినిమాకి ‘కిలాడీ’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏ స్టూడియోస్ పతాకం పై హవీష్ ప్రొడక్షన్లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా చేయనున్నారు. కాగా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు దర్సకనిర్మాతలు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు.

Related posts