telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ అంజలి, హీరో జై ఓకే రూమ్ లో… నిర్మాత షాకింగ్ కామెంట్స్

Anjali

ప్రముఖ తమిళ హీరో జై, హీరోయిన్ అంజలిపై కోలీవుడ్‌ నిర్మాత నందకుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అంజలి, జై ప్రధాన పాత్రలో నటించిన ‘బెలూన్’ సినిమాకు నందకుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో అంజలి, జైకి సంబంధించిన వివాదాస్పద ఘటన గురించి తాజాగా నందకుమార్ మీడియా ద్వారా వెల్లడించారు. “జై వల్ల నేను డబ్బులు పోగొట్టుకున్నాను. జై, అంజలితో ‘బెలూన్’ సినిమాను నిర్మించాను. అంజలి చాలా మంది అమ్మాయి. ప్రొఫెషనల్‌ పరంగా చాలా కచ్చితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే జై ఆమె జీవితంలోకి వచ్చాడో అంజలి చెడిపోయింది. బెలూన్ సినిమా షూటింగ్ సమయంలో జై మాటిమాటికీ షూటింగ్ డిస్టర్బ్ చేసేవాడు. ఓసారి కొడైకెనాల్‌లో షూటింగ్‌కి వెళ్లాం. షాట్ రెడీ అవడంతో డైరెక్టర్ అంజలికి ఫోన్ చేసి సెట్‌లోకి రమ్మన్నాడు. అయితే అతను అంజలిని మేడమ్ అని పిలవలేదని జై ఓవరాక్షన్ చేశాడు. మేడమ్ అని పిలవనందుకు అంజలి బాధపడలేదు. కానీ జై రెచ్చిపోయాడు. ఇలాగైతే షూటింగ్ ఆపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత రోజున అంజలి సెట్‌కి రాకపోవడంతో చాలా సార్లు ఫోన్ చేశాం. కడుపు నొప్పి వచ్చిందని అంజలి ఫోన్ చేసింది. దాంతో మేం కంగారుపడి వెంటనే కారు పంపించాం. కానీ అది అంజలి చేత జై ఆడించిన నాటకం అని ఆ తర్వాత తెలిసింది. మేం పంపిన కారులో జై అంజలిని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి చెన్నై తీసుకెళ్లిపోయాడు. దాంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. అంతేకాదు కొడైకెనాల్‌లో అంజలి, జై కోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో సపరేట్‌గా రెండు గదులు బుక్ చేశాం. కానీ అంజలి, జై ఒకే గదిలో ఉండేవారు. దాంతో మరో గదిని క్యాన్సిల్ చేయమని చెప్పాం. ఇందుకు జై ఒప్పుకోలేదు. ఆ గది రెంట్ రోజుకి 12 వేల రూపాయలు. ఈ సంఘటనల తర్వాత ఇంకెప్పుడూ జై లాంటి వ్యక్తితో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. అతను మంచి అమ్మాయి అయిన అంజలిని కూడా చెడగొట్టేశాడు” అని షాకింగ్ విషయాలు వెల్లడించారు. జై, అంజలి కలిసి “జర్నీ ” చిత్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం అంటూ వార్తలు విన్పించాయి.

Related posts