telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

జాత్యహంకారంతో గర్ల్ ఫ్రెండ్ పై ఉమ్మేసిన బాయ్ ఫ్రెండ్

Florida

కెన్నెత్ అట్‌కిన్స్ అనే తెల్ల జాతీయుడు, యాష్లే ఎడ్‌వార్డ్స్ అనే నల్ల జాతీయురాలు ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ తంపాలోని బ్రాడెంటన్ ప్రాంతంలో నివాసముంటున్నారు. ఆగస్ట్ ఆరో తేదీన యాష్లే సరదాగా ఓ గేమ్ ఆడదామంటూ కెన్నెత్‌ను అడిగింది. దీనికి కెన్నెత్ కూడా ఓకే చెప్పాడు. అయితే ఆ గేమ్ పేరు స్లేవ్ అండ్ స్లేవర్. అంటే ఒకరి దగ్గర మరొకరు బానిసగా ఉండటం అన్నమాట. గేమ్ ప్రకారం యాష్లే దగ్గర కెన్నెత్ బానిసగా ఉండాలని.. యాష్లే చెప్పింది. దీనికి కెన్నెత్ ఒప్పుకోలేదు. మరోమారు ఇదే మాట తెలిపింది. ఇక కెన్నెత్‌లో ఉన్న జాత్యాహంకారం ఒక్కసారిగా బయటపడింది. తెల్ల జాతీయులు నల్ల జాతీయుల దగ్గర బానిసలు ఏంటంటూ ఘర్షణకు దిగాడు. అలా చివరకు గర్ల్‌ఫ్రెండ్ యాష్లేపై ఉమ్మి వేశాడు. దీంతో యాష్లే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడకు చేరుకున్న పోలీసులు.. జరిగిన విషయాన్ని తెలుసుకుని కెన్నెత్‌ను అరెస్ట్ చేయబోయారు. తమ మధ్య కేవలం ఘర్షణ మాత్రమే జరిగిందని.. కేసు వద్దంటూ యాష్లే చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, కెన్నెత్‌ గురించి పోలీసులు ఆరా తీయగా.. గతంలో తనపై అనేక కేసులు ఉన్నట్టు గుర్తించారు. మే నెలలో ఓ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Related posts