telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భూకేటాయింపుపై సమీక్ష.. ఆ రెండు సంస్థల కేటాయింపులు రద్దు..

AP

అమరావతిలో రెండు ప్రముఖ సంస్థలకు జరిగిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ కేటాయింపుల సమయంలో చేసుకున్న నిబంధనలు అమలు చేయకపోవటం..ప్రభుత్వం నుండి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటు న్నట్లుగా పేర్కొంది. అదే సమయంలో ఈ సంస్థలు ప్రభుత్వానికి భూ కేటాయింపుల నిమిత్తం చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భూములు రద్దు చేస్తుండటంతో..తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆ సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసాయి. అదే విధంగా రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపుల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఒప్పందాలను పరిశీలిస్తోంది.

నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటనికి కొనసాగించాలని నిర్ణయించింది. భూములు కేటాయించిన మూడేళ్లవుతున్నా కార్యకలపాలు ప్రారంభించకపోవటం.. నోటీసులిచ్చినా స్పందించకపోవటం..విక్రమ ఒప్పందాలను కుదుర్చుకోక పోవటం వలనే కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. భుత్వంతో ఒప్పందం మేరకు భూములు తీసుకొని..ఒప్పందానికి కట్టుబడి ఉన్న సంస్థల విషయంలో మాత్రం జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఒప్పందాలను ఉల్లంఘించి..కేవలం వ్యాపారాల కోసమే భూములు తీసుకున్న వారి విషయంలో మాత్రం సమీక్షలో కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. ముందుగా నోటీసులు ఇవ్వటం..వారి స్పందనకు అనుగుణంగా చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Related posts