telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ఈటల !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3840 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 9 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 1198 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885 కు చేరగా.. రికవరీ కేసులు 3,09,594 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1797 మంది మృతి చెందారు..  ఈ నేపద్యంలో అందరూ తెలంగాణ లో లాక్ డౌన్ విధిస్తారని ఆందోళన చెందుతున్నారు, అయితే ఈ తరుణంలో ఈటల లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరడం జరిగిందని.. వారు సానుకూలంగా స్పందించారు కానీ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమే ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.. సెకండ్ వేవ్ కరోనా గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ వరి ధాన్యం కొనుగోలులో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కోరుతున్నానని తెలిపారు. హైదరాబాదులో వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి తెలంగాణకు మిగతా రాష్ట్రాల కంటే వ్యాక్సిన్ కేటాయించడం ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామని వెల్లడించారు. తెలంగాణలో కర్ఫ్యూ 144 సెక్షన్ లాక్ డౌన్ విధించే ఆస్కారం ఉండదని.. ప్రజలే అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని కోరుతున్నామని తెలిపారు.
దేశంలో లో రెండు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి.. మన తెలంగాణలో నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్లు అందించామని.. రైతాంగం క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Related posts