telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం…

drugs mafia in kalki bhagavan asram

భాగ్యనగరంలో మరోసారి  డ్రగ్ కలకలం రేపింది. ఎన్నిసార్లు దాడులు జరిగినా గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు డ్రగ్స్ విక్రయిస్తూనే ఉన్నారు.తాజాగా అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.  ఆ ముఠా ఆన్లైన్ ద్వారా వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందమైన ఆకర్షణీయమైన యువతుల ద్వారా విటులు, అలాగే ఇతరులకు ఈ ముఠా హెడ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు దాడి చేసే సమయానికి ముఠా హెడ్ వద్ద రెండు వందల గ్రాముల కొకైన్ ఉండగా దాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గోవా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ వ్యక్తీ దమైన యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్ తెచ్చి హైదరాబాద్‌, రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రముఖులకు విక్రస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Related posts