telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా వైరస్ పేరు మారింది.. ఇక నుంచి ‘కోవిడ్-2019’

karona virus case in canada found

ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ పేరు మారింది. ప్రమాదకర ఈ వైరస్‌కు ‘కోవిడ్-2019’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ టెడ్రన్ అదానోమ్ తెలిపారు. కోవిడ్-19 (covid-2019) అంటే ‘కరోనా వైరస్ డిసీజ్ 2019’ అని అర్థమని పేర్కొన్నారు.

కొన్ని వైరస్‌ల సమూహానికి కరోనా అని పేరు ఉందని కాబట్టి, ఈ గందరగోళాన్ని తొలగించేందుకే కొత్త పేరు పెట్టినట్టు తెలిపారు. ఈ పేరు స్వతంత్రంగా ఏ ఒక్కదానినీ సూచించదని పేర్కొన్న టెడ్రస్.. ఈ కొత్త పేరు ఆ వ్యాధిని గురించి మాత్రమే తెలియజేస్తుందని స్పష్టం చేశారు.

Related posts